బ్యాలెట్ బాక్సుల రిసీవింగ్ సెంటర్లను స్ట్రాంగ్ రూములను,,,

పరిశీలించిన నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

బ్యాలెట్ బాక్సుల రిసీవింగ్ సెంటర్లను స్ట్రాంగ్ రూములను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పరిశీలించారు. గురువారం సాయంకాలం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి నంద్యాల పట్టణంలోని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ లను బ్యాలెట్ బాక్స్ ల రిసీవింగ్ సెంటర్లను  పరిశీలించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ నంద్యాల రెవెన్యూ డివిజన్లో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్ట్ ద్వారా డివిజన్లోని అన్ని పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు. సాయంకాలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నంద్యాల. గోస్పాడు సిరివెళ్ల, బండి ఆత్మకూర్ మండలాలకు సంబంధించిన   ప్రభుత్వ జూనియర్ కాలేజీలో,  మహానంది మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల రిసీవింగ్ సెంటర్లను, బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేసిన గదులను కూడా పరిశీలించామని  అన్నారు.
స్ట్రాంగ్ రూములందు భద్రతా ఏర్పాట్లు ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు విద్యుద్దీపాల ఏర్పాట్లు సీసీ కెమెరాల ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు ఇచ్చామని, వాటన్నిటినీ సక్రమంగా ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. పోలింగ్ కేంద్రాల నుండి పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకుంటాయని,  అనంతరం స్ట్రాంగ్ రూముల్లో వాటిని ఉంచి  సీల్ చేసి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, నంద్యాల,  గోస్పాడు. సిరివెళ్ల. బండి ఆత్మకూరు. మహానంది మండలాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: