షాద్ నగర్ జర్నలిస్టు "ఏబీఎన్ గిరి" మృతి 

 విషాదంలో మీడియా లోకం 


(జానోజాగో వెబ్ న్యూస్-షాద్ నగర్ ప్రతినిధి)

కరోనా మహమ్మారికి మరో కలం యోధుడు మృత్యువాత పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఆంధ్రజ్యోతి విలేఖరి మాదిరాజు గిరి ఆదివారం మృతి చెందారు. గత వారం రోజులుగా కొవిడ్-19 వ్యాధితో వైరస్ సోకి బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని జైదేవ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జర్నలిస్ట్ గిరి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో వెంటిలేటర్ పై ఉంచారు. అయితే పరిస్థితి చేయి దాటి పోవడంతో గిరి ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు. గిరికి భార్య పిల్లలు ఉన్నారు. వీడియో గ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన గిరి అతి తక్కువ కాలంలో అందరి మన్ననలు చూరగొన్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించారు. ఏబీఎన్ గిరిగా పేరు సంపాదించారు. ఆయన అకాల మరణం పట్ల తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిద్దాం

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: