దివ్యాంగులకు వీల్ ఛైర్ బహుకరణ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని  గిరినాథ్ సెంటర్ లో నివాసం ఉన్న కే. సుబ్బమ్మ తనకు వచ్చినటువంటి పింఛన్ లో కొంచెం సొమ్మును దాచుకుని నంద్యాలలోని దివ్యాంగులు అయిన నైట్ సెంటర్ లో ఉన్న మహేష్ కు, నడిగడ్డలో ఉన్న భాషకు ఈ ఇద్దరికీ పదకొండు వేల రూపాయలు విలువచేసే రెండు వీల్ చైర్ లను తానే స్వయంగా వచ్చి తన చేతుల మీదుగా ఇచ్చి ఆర్థికంగా సహాయపడ్డారు. ఈ ఇద్దరు వికలాంగులు వీల్ చైర్ లను ఇచ్చినందుకు  కె సుబ్బమ్మకు  కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ కే సుబ్బమ్మ తన పింఛన్ డబ్బులను ఇద్దరూ వికలాంగులకు వీల్ చైర్ లు ఇచ్చినందుకు కే సుబ్బమ్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి, సుభాష్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ వలీ సభ్యులు పి నరేంద్ర రెడ్డి, వెంకటేశ్వర్లు, డి హుస్సేన్ వలి సభ్యురాలు నౌషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: