వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి

- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య

- పీసీసీ అధికార ప్రతినిధి కొట్టు వాసు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ కు మోసం చేసిన  బీజేపీ వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, పీసీసీ అధికార ప్రతినిధి కొట్టు వాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 2014 సంవత్సరం విభజన సమయంలో తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ కు దేశంలో ఎక్కడా నిర్మించని రాజధాని నిర్మిస్తామని అక్కడ వెలిసిన శ్రీ లక్ష్మి వేంకేటేశ్వరస్వామి సాక్షిగా చెప్పి మోసం చేసిన పార్టీ నేడు మరల పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతున్నాయని, ఆ రాష్టానికి  ప్రతేక హోదా ఇస్తామని చెప్పడం ప్రజలను నమ్మకద్రోహం చేసే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. వెంటనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఒక న్యాయం పుదుచ్చేరికి ఒక న్యాయమా, 2014 నుండి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్లి ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని నంద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి చింతలయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోశాధికారి ఎస్.వైడీ.ప్రసాద్, జాకీర్, చిన్నారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: