మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా,,,

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలి

-కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్  

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. నంద్యాల ప్రధాన సెంటర్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ 48 గంటల నిరాహారదీక్ష చేపట్టిన వంకిరి రామచంద్రుడుకు కాంగ్రెస్ పార్టీ  నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల ప్రధాన సెంటర్ లలో అంబెడ్కర్ విగ్రహం కోసం దీక్ష చేయలవలసిన అవసరం వచ్చినందుకు చాలా బాధాకరమైన విషయమని, ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రధాన సెంటర్లలో  ఏర్పాటుపై అధికారులు, నంద్యాల అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మౌనం విడాలని లేకపోతే మేమే ముందు ఉండి అంబెడ్కర్ విగ్రహని ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ సమావేశం ఏర్పాటుచేసి చైర్మన్,  కౌన్సిలర్లు ఓ తీర్మానం చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్ సర్కిల్ అనే   నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.

 


ప్రపంచ మేధావి దేశంలో కులాల మతాలకు నోరు ఉన్నవారికి నోరు లేని వారికి ప్రతి ఒక్కరికి హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై  పాలకులు, అధికారులు రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వ అధికారులకు ఎమ్మెల్యే, ఎంపీకి, మున్సిపల్ చైర్మెన్లు మున్సిపల్ కౌన్సిలర్లకు ఐదు రోజులు గడువు ఇస్తున్నామని,  మున్సిపల్ కార్పోరేషన్ ఎదురుగాఅంబేద్కర్ విగ్రహం    పెట్టకపోతే కలసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని మేమే విగ్రహం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: