రైతులకు శాపంగా బీజేపీ
అన్నదాతల విమర్శ
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని రైతులు విమర్శించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు అధిక ధరలకు పెంచినందుకు నిరసనగా ప్రకాశం జిల్లా తర్లుపాడు బస్టాండ్ సెంటర్ నందు మండల రైతు సంఘం నాయకులు ఏరువా పాపిరెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల రైతు సంఘం నాయకులు ఏరువ. పాపి రెడ్డి మాట్లాడుతూ రైతు పంట పండించడానికి నా నా వ్యవస్థలు పడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎరువుల రేట్లు పెంచుకుంటూ పోతుంది.
పెంచిన అధిక రేట్లతో రైతులు పంట పండించడానికి త్రీవ ఇబ్బందులు పడాల్సి పరిస్థితి వస్తుందని తక్షణమే పెంచిన ఎరువుల ధరలను తగ్గించకపోతే గ్రామ గ్రామాన రైతు ఉద్యమాలు చూడాల్సిన వస్తుందని అన్నారు. అధిక రేట్లతో పెరిగిన ఎరువుల ను కొనుగోలు చేసి రైతులు పంట పండించాలంటే పీకల్లోతు అప్పులు చేసి రైతులు ఆత్మహత్యకు పాల్ పడాల్సి పరిస్థితి వస్తుందని తక్షణమే ఎరువుల రేట్లు ను తగ్గించి రైతులను ఆదుకోవాలని వివరించారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని ఎంతో శ్రమించి దేశ ప్రజలకు సిరిగిరి అన్నాన్ని పండించే రైతుల కడుపు కొట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో తపనం.నారాయణరెడ్డి, దేవి రెడ్డి, తిరుపతి రెడ్డి, నాగూర్ వలి, గాలేయ్య, ఇజ్రాయిల్, కాశయ్య రైతులు, కర్షకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: