దళిత బహుజన నాయకత్వాన్ని గుర్తించాలి

ఆ బాధ్యత ప్రభుత్వ పెద్దల పై వివిధ పార్టీల అధినేతల పై ఉంది

నర్రి  స్వామి కురుమ

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

నర్రి స్వామి కురుమ ఆధ్వర్యంలో భారత దేశం యొక్క మొట్టమొదటి దళిత ఉపప్రధాని సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ఎల్బీనగర్ చౌరస్తాలో లో ఉన్న బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి కి పూలమాలలు వేసి వివిధ సామాజిక సంఘాలు మహిళా  సంఘాలతో కలిసి విలేకర్ల సమావేశంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి  స్వామి కురుమ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళిత సామాజిక వర్గాల నాయకులను గుర్తించి నాయకత్వాన్ని బల పరచాల్సిన బాధ్యత

ప్రభుత్వ పెద్దల పైన వివిధ పార్టీల అధినేత ల పైన గురుతర బాధ్యత ఉందన్నారు బాబు జగజీవన్ రావు గారిని నేటితరం యువకులు మేధావులు విద్యావంతులు ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకులు ఎదగాలని సూచించారు అదేవిధంగా దళిత బహుజనులను ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు కాకుండా రాజకీయ నాయకులుగా తయారుచేసే పార్టీలకు మాత్రమే దళిత బహుజనులు అండగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడ్డాల రమేష్ గడ్డి అన్నారం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్, మహిళా సంఘాల నాయకులు  ఉపేంద్ర యాదవ్, లింగోజిగూడ నాయకులు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు సంపత్ రెడ్డి, ఓయూ నాయకుడు కొండ గణేష్,ప్రశాంత్, రామకృష్ణ,  బీరయ్య ,మల్లేష్ తదితరులు  పాల్గొన్నారు.
 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: