ఘనంగా పూలే జయంతి వేడుకలు
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
నర్రి స్వామి కురుమ
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈరోజు ఎల్బినగర్ చౌరస్తాలోని పూణే చౌక్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే 194 వ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి స్వామి కురుమ మాట్లాడుతూ సంఘ సంస్కర్త భారత దేశ ముద్దుబిడ్డ నవయుగ భారత నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే మహిళల కోసం బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం అనేక మైనటువంటి ఉద్యమాలు చేసి తన యొక్క జీవితాన్ని దళిత పీడిత ప్రజల చైతన్యం కోసం అర్పించారు అదేవిధంగా భారతదేశంలో విద్య అనేది అన్ని వర్గాల వాళ్ళు నేర్చుకొని ఆధునిక రాజకీయంగా ఎదిగి రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలన్నారు వీరి యొక్క విధానాలని అనుసరించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది వీరి యొక్క ముందుచూపు దార్శనికత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అన్నారు అదేవిధంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకు పోతూ దళిత బహుజనులు అంతా ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని నర్రి స్వామీ హిందూ కురుమా వాడనీ సూచించారు ఈ కార్యక్రమంలో మేకపోతుల నరేందర్ గౌడ్ ,మధుసూదనా చారి ,కొండ గణేష్, మోటే మహేష్, ఉపేంద్ర యాదవ్, రాజశేఖర్ రెడ్డి, సంపత్ రెడ్డి , పరశురాములు వివిధ సామాజిక సంఘాల ఉద్యమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: