అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్,,,

విజేత కర్నూల్ జట్టు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్పందన అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  రెండు రోజులుగా  నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో  నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ లో ఆదివారం మధ్యాహ్నం తిరుపతి, కర్నూలు రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన కర్నూలు జట్టు 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన  తిరుపతి జట్టు 11 ఓవర్లలో అన్నివికెట్లు కోల్పోయి 85  పరుగులు మాత్రమే చేయడంతో, అంతర్జాతీయ అంధుల క్రికెట్ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్ నేతృత్వంలో కర్నూలు జట్టు 92 పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. ఫైనల్ పోటీలో కర్నూలు క్రీడాకారుడు రవీంద్ర 63 పరుగులతో, మదన్ మోహన్ ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు. టోర్నమెంట్ ను స్పందన అంధుల సంక్షేమ సంఘం నిర్వాహకులు చంద్రశేఖర్, పుల్లయ్య, ఓబులేసు, గుర్రప్ప, రమణ పర్యవేక్షించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: