కత్తితోకాదు...ప్రేమతోనే వచ్చింది

సమానత్వ సందేశమిచ్చిన ఇస్లాంను భారత్ లో ఘనస్వాగతం పలికారు

ఇస్లాం విస్తరణ...వాస్తవిక అంశాలు...?

ఒక సద్దుద్దేశంపై గిట్టని ఎన్నో దురుద్దేశాలు పుట్టుకొస్తాయట. సమాజంలో శాంతి, సమానత్వం, మానవత్వం, నైతిక జీవన విధానాలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఇస్లాంపై నేటికీ మన దేశంలో ఓ అపోహ ప్రచారంలో పెట్టారు. ఇస్లాం కత్తితో వ్యాపించిందని, అందుకే ఘర్ వాపసీ అంటూ పిలుపునిస్తూనే ఇస్లాంను క్రూరత్వానికి చిహ్నంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇస్లాం కత్తితో వ్యాపించింది అని చెప్పేవారికి ఆ వాస్తవం వారి తత్తాల నుంచి పూర్వికుల నుంచి తెలిస్తే ప్రస్తుతం మతం మారి ఇస్లాం తీసుకొని ముస్లింలుగా కొనసాగుతున్న ఇప్పటి భారతీయులకు వారి వారి పూర్వీకులు కూడా తాము ఎందుకు ఇస్లాంను స్వీకరించాల్సి వచ్చిందో చెప్పివుంటారు కదా...? నిజంగా కత్తి భయంతో నాడు వారు ఇస్లాం స్వీకరించివుంటే భారతదేశం స్వాతంత్య్రం పొందాక వారు నిర్భయంగా తమ పూర్వమతంలోకి మారేవారు కదా..? అలా కాకుండా ఇస్లాం స్వీకరించిన వారందరూ ముస్లింలుగానే కొనసాగడానికి కారణం ఏమిటీ అంటే వారు కత్తిభయంతో కాదు ఇస్లాం బోధనలతోనే మతం మార్చుకొన్నట్లు ఇట్టే స్పష్టమవుతుంది. ఈ క్రమంలో భారతదేశంలోకి ఇస్లాం ఎలా వ్యాపించింది అన్న దానిపై ఓ వాస్తవిక కథనం మీ కోసం...?

ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మొత్తం దాదాపు 50 కోట్లమంది ముస్లింలున్నారు. ప్రపంచం లోనే అత్యధిక ముస్లిం జనాభాలలో అగ్ర స్థానాలలో ఒకటిగా ఈ ప్రదేశం ఉంది. కొందరు ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతూ ఇస్లాం భారత భూమి పైకి రక్త పాతం తో, బలవంతపు మత మార్పిడీలతో వచ్చింది అని దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ వారు చెప్పే బూటకపు కథలు వాస్తవికకు చాలా దూరంగా ఉన్నాయి. 

మొదట ఇస్లాం భారత దేశం లో ఎలా వచ్చింది: 

క్రీ. స. 600 కి పూర్వం కూడా ( అంటే మొహమ్మద్ స. వారు పుట్టక పూర్వం ) అరబ్ లు, ఇండియా లో వెస్ట్ రీజన్ అంటే భారతదేశ పడమర కోస్తా ప్రాంతం లో  వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ప్రవక్త అరబ్ దేశాలలో ఇస్లాం యొక్క సందేశం మొదలు పెట్టినప్పుడు, ఆ వ్యాపార వేత్తలు భారతదేశం లో కూడా ఇస్లాం సందేశం ఇచ్చే వారు. ఈ నేపధ్యం లో కేరళ మలబార్ ప్రాంతపు రాజు అయిన చెరమన్ పెరుమాల్ భాస్కర్ రవి వర్మ ప్రవక్త వారి గురించి ఆ అరబ్బుల ద్వారా విని మక్కాకు ప్రయాణించి అక్కడ ఇస్లాం స్వీకరించారు, 929 A.D లో భారతదేశంలో మొట్ట మొదటి మస్జీద్ నిర్మిచారు. ఆ మస్జీద్ పేరు చెరమన్ జమా మస్జీద్. ఆ మస్జీద్ ఇప్పటికీ ఉంది. ఈ విధంగా చెరమన్ పెరుమాల్ భాస్కర్ రవి వర్మ భారతదేశం నుండి మొట్ట మొదటి ముస్లిం  అయ్యారు. ఇదే విధంగా అరబ్బుల లావా దేవీలు, రాకపోకల వల్ల కోస్తా ( వెస్ట్) ప్రాంతం లో ఇస్లాం వ్యాప్తి చెందుతూ పోయింది. 

మొహమ్మద్ బిన్ ఖాసిం:

( వారి పై అల్లాహ్ యొక్క శాంతి ఉండు గాక)

మొట్టమొదటి పెద్ద ఇస్లాం వ్యాప్తి చడడం మక్కా లో ఉమ్మయ్( ర) వారు ఖలీఫా ( ఇస్లామిక్ లీడర్) గా ఉన్నప్పుడు 17 సం వయస్సు గల మొహమ్మద్ బిన్ ఖాసీ వారిని ఇస్లాం వ్యాప్తి కోసం సింధ్ ప్రాంతానికి ( ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది ) పంపించారు. ఆయన 6000 మంది సైన్యం తో పెర్సీయా, మక్రన్ ప్రాంతానికి వచ్చారు వచ్చేటప్పుడు వారికి ఎవరు ఎదురు తిరిగి యుధం చేయలేదు, వారు ఇండస్ నదీ తీరాన ఉండే నెరున్ పట్టణానికి చేరినప్పుడు అక్కడి బౌద్ద మతస్తులు 

(అప్పుడు ఆప్రాంతం  వారి ఆధీనం లో ఉన్నింది) వారిని ఘనంగా స్వాగతించారు. నదీ తీర ప్రాంతం లో  ఉండే బౌధులు హిందూ ప్రభుత్వ దౌర్జన్యాలకు లోనయ్యేవారు. దీంతో బౌద్దులు తమ రక్షణ కొరకు ముస్లింల శరణను కోరారు. ఆ విధంగా ఆ ప్రాంతం మొత్తం ముస్లింల ఆధీనం లోకి వచ్చింది. అక్కడి అత్యధిక ప్రజలు అందరు ఇస్లాంను స్వీకరించినా సింధ్ మహారాజా దహీర్ ఇస్లాం వ్యాపించడం నచ్చక , ముస్లింలపై యుధం ప్రకటించారు. 712 A.D లో యుధం జరిగి , యుధంలో ముస్లిలు విజయం సాధించి మొత్తం సింధ్ ముస్లింల ఆధీనం లో కి వచ్చింది. 

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సింధ్ ప్రాంత ప్రజలను బలవంతంగా ఇస్లాం లో మర్చ లేదు. అక్కడి ప్రజలు పూర్వం ఎలా ఉండే వారో అదేవిధంగా జీవీనం కొనసాగించే విధంగా వారికి పూర్తి స్వేక్ష ఇవ్వబడింది. అక్కడి హిందువులు, భౌద్దులు వారి వారి ధర్మాచారాలను అనుసరించే వారు, మొహమ్మద్ బిన్ ఖాసిం వారి పరమత సహనం, వారు చేసే న్యాయం , సడప్రవర్తన , మంచితనం చూసి అక్కడి అనేక ప్రాంతాల వారు మొహమ్మద్ బిన్ ఖాసిం వారిని వారి సైన్యాన్ని హిందూ, బౌధులు ఆయనకు మ్యూసిక్ , డ్యాన్స్ లతో ఘన స్వాగతం పలికే వారు. ముస్లింలు సాధించిన ఈ విజయం తో, ఇస్లాం యొక్క సద్ప్రవ వర్తన తో ప్రఖ్యాత్తి చెంది అనేక మంది ఇస్లాం స్వీకరించారు.  ఇదే తరహా లో మొహమ్మద్ ఘజ్నీ, మొహమ్మద్ తూగ్లగ్ లు కూడా వారి ప్రాంత ప్రజల ( హిందూ, బౌద్ధ) మాతా చారాలను ఆటంకం కలిగించ కుండా, భారత దేశం లో శాంతి యూతంగా విజయాలు సాధించారు. ఎక్కడ కూడా బలవంతపు మతమార్పిడీలు జరగ లేదు. 

ఇస్లాం ( ఖురాన్ ) పరంగా బలవంతపు మత మరిపిడీ నిషేధం 

(Quran - 2 : 256) ధర్మం   విషయంలో   బలవంతం   ఏమీ   లేదు.   సన్మార్గం   అపమార్గం   నుంచి   ప్రస్ఫుటమయ్యింది.   కనుక   ఎవరయితే   అల్లాహ్   తప్ప   వేరితర   ఆరాధ్యులను   (తాగూత్ను)   తిరస్కరించి   అల్లాహ్ను   మాత్రమే   విశ్వసిస్తారో   వారు   దృఢమైన   కడియాన్ని   పట్టుకున్నారు.   అది   ఎన్నటికీ   తెగదు.   అల్లాహ్   సర్వం   వినేవాడు,   సర్వం   తెలిసినవాడు.

భారత్ లోని "కుల వ్యవస్థ"

ఇస్లాం కు పూర్వం ఇండియా లో కులాల వ్యవస్థ ఉంది , మానవ సమాజాన్ని , మానవత్వాన్ని విభజించి ఉన్నింది, తక్కువ కులం వారు, అంటరాని వారు అనే భేద భావాలు విపరీతంగా ఉండేవి, మంచి నైపుణ్యం గల దళితులు బ్రాహ్మణుల అణిచివేత కారణంగా ఎదగాలేక పోయేవారు, తండ్రికి తగ్గట్టుగానీ తనయునికి పని ఇచ్చే వారు, అంటే దళితుడి కుమారుడు , దళితుడిగానే ఉండాలి అనే సిద్దాంతం నాడుండేది. అనేక చోట్ల అగ్రకులం వారి అణిచివేత సహించలేని అనేక దళితులు, ఇస్లాం లో ఉండే సమానత్వం, న్యాయం చూసి ఇస్లాం వైపు ఆకర్షితులు అయ్యారు. అనేక చోట్ల తండోప తాండంగా ఒకే సారి ఇస్లాం స్వీకరించేవారు, బౌద్ధ మతం ఒకప్పుడు భారతం లో ఆగ్రా మతం గా ఉండేది, హిందుత్వం లోని కుల వ్యవస్థ తో విసుగెత్తిన వారు భౌద్ద మతం స్వీకరించే వారు, ఇస్లాం వచ్చిన తర్వాత బౌధమతం కాకుండా ఇస్లాం వైపు ఆకర్షితులయ్యారు.   ఇదంతా అనేక సంవత్సరాల వ్యవధిలో నిధనంగా జరిగింది. 

సూఫీల రాకతో ఇండియాలో ఇస్లాం మరింత ప్రాచుర్యంలోకి..

ఇస్లాం వ్యాప్తి చెందడానికి ఇంకొక ముఖ్య సాధనం ఏమిటంటే అనేక ముస్లిం వక్తలు ప్రచారం కోసం పలు ప్రదేశాల్లో వెళ్లే వారు, వీరిని సూఫీ అంటారు, ఇస్లాం బోధ ప్రజలు చెప్పేవారు. అనేక చోట్ల వీరి పేర్ల మీద ఇప్పటికీ దర్గా లు ఉన్నాయి, వీరి వల్ల ఎన్నో ప్రాంతాలలో ప్రజలు ఇస్లాం స్వీకరించారు.  ఇస్లాం బలవంతంగా, హత్యలతో వ్యాప్తి చెందింది అని దుష్ప్రచారం చేసే వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. బలవంతపు మతమార్పిడీ కథనాలు కొన్ని చిన్న చిన్న కథనాలు  విన్నప్పటికీ చారిత్రాత్మక ఆధారాలు ఏవీ లేవు. 

ఆ ప్రాంతాలలో కూడా ఇస్లాం స్వీకరించడం దేనికి సంకేతం: 

ఒకవేళ బలవంతపు మార్పిడీలు జరిగి ఉండి ఉంటే ఏదో ఒక ప్రాంతం లో మాత్రమే ముస్లిం లు ఉండే వారు, అలా కాకుండా భారత దేశం మొత్తం లో ముస్లిం లు వ్యాపించి ఉండడం, అక్కడి ప్రజలు స్వతహాగా ఇస్లాం స్వీకరించారు అనడానికి నిదర్శనం. ఉత్తరం వైపున ఉండే సింధ్, పంజాబ్, కాశ్మీర్ లతో పాటు, పశ్చిమం వైపు ఉండే కేరళ, గోవా, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో , తూర్పు వైపు ఉండే బంగ్లాదేశ్, మయన్మార్, దక్షణం వైపు ఉండే అనేక ప్రాంతాలతో పాటు, తూర్పు శ్రీ లంక లో కూడా ఇస్లాం వ్యాపించింది.  ఆ ప్రాంతాలలో ముస్లింల పరిపాలన లేనప్పటికీ ఇస్లాం వ్యాప్తి చెందింది, 

ముస్లింలు పరదేశం నుండి వచ్చి స్థిర పడ్డారు అనే దురాలోచన నుండి ప్రజలు బైటికి రావాలి. ఇస్లాం లో ఉండే శాంతి, నీతి, న్యాయం, ధర్మం, సమానత్వం చూసి ప్రజలు ఆకర్షితులు అయ్యి ఇస్లాం స్వీకరిచారు, భారత దేశానికి ఇస్లాం అనుబధం దాదాపు 1400 సం లది, ఇస్లాం భారత దేశ అంతర్భాగం అనడానికి ఈ చారిత్రాత్మక విషయాలు నిదర్శనం. అంతే గాక బ్రిటీషు వారి మీద అనేక లక్షల ముస్లిం స్వతంత్ర సమరయోధులు పోరాడి భారత దేశాన్ని సాధించారు. 

భారత దేశం లో పాలించిన ప్రతి ఒక్క ముస్లిం రాజు ఈస్ల్మా వ్యాప్తి కోసం రాలేదు, కొద్ది మంది మాత్రమే ఇస్లాం ప్రచారం కోసం వచ్చారు, మిగతా వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వచ్చారు అని గమనించండి.  1000 సం లు ముస్లిం ల పాలనలో బలవంతపు మతమార్పిడీలు జరిగి ఉండి ఉంటే నేటికి భారత దేశం లో 70% హిందువులు మిగిలి ఉండే వారు కాదు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: