స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు

- నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల డిఎస్పి చిదానంద రెడ్డి అన్నారు. మంగళవారం జెడ్ పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ బాక్సుల స్ట్రాంగ్ రూముల కొరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీల  రూములను నంద్యాల డిఎస్పి చిదానంద రెడ్డి, డివిజినల్ డెవలప్మెంట్ అధికారి భాస్కర్, ఆర్ఓసివి రమణయ్య, నంద్యాల తహసీల్దార్ రవికుమార్, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా డిఎస్పి చిదానంద రెడ్డి మాట్లాడుతూ
ఈ నెల 8న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ జరగనున్నందున ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా స్ట్రాంగ్ రూముల దగ్గర కౌంటింగ్ కేంద్రాల వద్ద దాదాపు 600 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలలాగనే ఈ ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసులు బందోబస్త్ ను నిర్వహించనున్నామన్నారు. డెవలప్మెంట్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని,  ఇప్పటికే గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను, ఆర్ఓలతో కలిసి పరిశీలించామన్నారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలాగానే వీటిని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలింగ్ నిర్వహణ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూములకు తరలిస్తామన్నారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: