కెవిపిఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో...

ఘనంగా అంబేద్కర్ జయంతి

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కెవిపిఎస్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో లో ఏబీఎన్ పాలెం నుండి శాంతి టాకీస్ మీదుగా ఆత్మకూరు రోడ్ జ్యోతిరావు పూలే మిడ్తూర్ రోడ్డు అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు ఆవాజ్ నాయకులు అబు బాకర్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఫకీర్ సాహెబ్ రజిత వెంకటేశ్వర్లు డప్పు కళాకారుల సంఘం నాయకులు నాగభూషణం సుంకన్న బొల్లవరం గ్రామం మాజీ సర్పంచ్ చేస్తున్న శ్రీ రాములు పుల్లయ్య తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ
అంబేద్కర్ రాజ్యాంగం రాసి 70 ఏళ్లు గడిచినప్పటికీ భారతదేశంలో నేటికీ వివక్షత అంటరానితనం మహిళలపై అత్యాచారాలు నిరుద్యోగ సమస్య పేదరికం దరిద్రం ఆకలి చావులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని వారు విమర్శించారు నేడు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇ ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల రిజర్వేషన్లు అమలు జరగడం లేదని వారు ఆరోపించారు ఉత్తర ప్రదేశ్ గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు మైనార్టీలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేపట్టాలని డప్పు కళాకారులకు అందరికీ 5000 పింఛన్ ఇచ్చి డ్రస్సు గజ్జలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: