రూపు మార్చుకొని...ఉతికారేస్తోంది
కరోనా సెకండ్ వేయ్ తో జాగ్రత్తగా ఉండండిలా
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కోవిడ్ వైరస్ అనేక జన్యు మార్పులు చెంది రెండవ దశ లోనికి ప్రవేశించి, తన లక్షణాలు, వ్యాధి ప్రభావం సైతం మార్చుకుని, బలం పుంజుకుని చాప కింద నీరులా మొదటి దశ లో కంటే అత్యంత తీవ్ర ప్రభావం చూపిస్తూ ప్రజల యొక్క ప్రాణాలు వేగంగా బలి తీసుకుంటున్నది. దీన్నే ప్రస్తుతం సెకండ్ వేవ్ అంటున్నారు.
పైకి అంతా మామూలే ఏం పరవలేదు అని అనిపిస్తున్నా, ప్రస్తుతం మనం మొదట్లో కంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నామని సంగతి ఎవరికీ అర్దం కావడం లేదు. మొదటి దశలో కోవిడ్ వైరస్ జన్యుపరమైన మార్పులు చెందలేదు. వ్యాధి లక్షణాలు కూడా తేలిక పాటి జ్వరం, వాసన, రుచి గుర్తించలేకపోవడం, కొద్దిపాటి చలి మరియు శ్వాస సరిగా అందకపోవడం వంటివి ఉండేవి.
వివిధ దేశాల ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, కఠిన షరతులతో కొద్ది కాలం పాటు విధించిన లాక్ డౌన్ వలన వైరస్ ప్రభావం తీవ్రత తగ్గుముఖం పట్టడముతో అంతా బాగుంది అని భావించి, ఆయా దేశాల యొక్క ఆర్దిక పరిస్థితులు, ప్రజలయొక్క కుటుంబ జీవన శ్రేయస్సు దృష్టి లో పెట్టుకుని సడలించిన ఆంక్షలు తో మామూలు పరిస్థితులు ఏర్పడుతున్న ఈ తరుణం లో కోవిడ్ వైరస్ జన్యు పరంగా మార్పులు చెంది మొదటి దశ నుండి రెండో దశలోకి ప్రవేశించింది.
హఠాత్తుగా కళ్ళు ఎర్రబారడం, ఎడతెగని నీళ్ళ విరోచనాలు, మరియు వినికిడి సమస్య లు వంటి లక్షణాలు తో పాటు మొదటి దశ లక్షణాలు శరీరం లో గమనిస్తే వారు కోవిడ్ రెండవ దశ ప్రభావానికి గురయినట్లు భావించాలి. ఇటువంటి సందర్భం లో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు దిగువన ఇవ్వబడ్డాయి.
కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి..?
సాధారణ లక్షణాలు అయిన జ్వరం, వళ్ళు నొప్పులు, రుచి వాసన తెలియడం లేదు అనిపించినప్పుడు, చలి మరియు శ్వాస సరిగా తీసుకోలేని సందర్భాలు తో పాటు, రెండోదశలోని కొత్త లక్షణాలు అయిన కళ్ళు ఎర్రబారడం, నీళ్ళ విరోచనాలు, వినికిడి సమస్య లు వంటి వాటితో పాటు, ఎవరైనా సరే కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించిన వ్యక్తితో పొరపాటున కనీసం 6 అడుగులు కంటే దగ్గరగా, మరియు ఆ వ్యక్తితో 15 నిముషాల కంటే ఎక్కువ సమయం సంభాషించినా, అతనితో గడిపినా, అటువంటి వారు ఖచ్చితముగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి.
కోవిడ్ పరీక్ష అవసరము లేని వ్యక్తులు ఎవరు..?
ఎవరైతే వ్యక్తులు ప్రభుత్వము సూచించిన విధముగా కోవిడ్ వ్యాక్సిన్ ను రెండు డోసులు పొంది 15 రోజులు దాటిపోయి ఉంటా రో, అటువంటి వ్యక్తులు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తుల తో 6 అడుగులు కంటే దగ్గరగా, మరియు ఆ వ్యక్తితో 15 నిముషాల కంటే ఎక్కువ సమయం సంభాషించినా, అతనితో గడిపిన వ్యాక్సిన్ పొందిన సదరు వ్యక్తులకు తరువాత వారికి ఎటువంటి కోవిడ్ లక్షణాలు కనిపించకపోతే వారు పరీక్ష చేయించుకొన అవసరం లేదు.
ఎలాంటి పరీక్ష చేయించుకోవాలి..?
ప్రస్తుతం రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR)విధానం ద్వారా నిర్వహించే పరీక్షని కోవిడ్ నిర్ధారణకు ఉత్తమ పరీక్ష గా ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు.
ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT) అని మరొక పరీక్ష విధానం కూడా అందుబాటులో ఉన్నది. ఈ ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT)విధానం లో ఫలితాలు అనేవి వేగవంతంగా పొందవచ్చు. ఒకవేళ కోవిడ్ వ్యాధి లక్షణాలు కలిగి ఉండి ఈ ర్యాపిడ్ అంటిజెన్ టెస్ట్(RAT)విధానం లో కోవిడ్ లేదని ఫలితము వచ్చినట్లయితే అటువంటి సందర్భాల్లో రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షా విధానం సిఫార్సు చేయబడుచున్నది.
ఈ మధ్య CT వాల్యు , CT స్కోర్ అంటున్నారు అవి దేనికి సంబంధించినవి..?
CT (Cycle Threshold) వాల్యూ అనేది రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమర్స్ ఛైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షా విధానం లో రోగి నుండి తీసుకున్న నమూనా లో ఉండే వైరస్ జన్యు పదార్ధం యొక్క పరిమాణాత్మక సాంద్రత విలువలు సూచిస్తుంది. ఈ RT-PCR పరీక్షా విధానం లో తక్కువ పరిమాణం లో నమోదు అయ్యే CT వాల్యు సంబంధిత రోగి అధిక వైరల్ లోడ్ తో తీవ్రమైన వ్యాధి తో బాధపడుతున్నాడని, మరియు ఇతని ద్వారా అంటువ్యాధి అధికంగా ప్రభలే అవకాశాన్ని సూచిస్తుంది. అలాగే ఈ పరీక్షలో అధిక పరిమాణం లో నమోదు అయ్యే CT వాల్యు సంబంధిత రోగి తక్కువ వైరల్ లోడ్ తో తక్కువ అంటువ్యాధి కలిగి ఉన్నాడని మరియు ఇతని వలన సంక్రమణ ప్రమాదము తక్కువ ఉంటుందని చెప్పవచ్చు.
ఇక CT స్కోరు అనేది COVID-19 ప్రమేయము వలన ఊపిరితిత్తులలో కలిగిన మార్పులు మరియు వాటిని అంచనా వేయడానికి CT స్కాన్ ద్వారా పరీక్ష చేసి దాని ఆధారంగా నిర్ణయించే స్కోరింగ్ వ్యవస్థ ని CT స్కోర్ అంటారు. ఈ CT స్కాన్ పరీక్షా విధానం లో తక్కువ గా నమోదు అయ్యే CT స్కోర్ తో సంబంధిత రోగి తక్కువ వైరల్ లోడ్ తో తేలికైన వ్యాధి తో బాధపడుతున్నాడని, మరియు ఇతని ద్వారా అంటువ్యాధి ప్రభలే అవకాశం తక్కువుగా సూచిస్తుంది. అలాగే ఈ పరీక్షలో అధికంగా నమోదు అయ్యే CT స్కోర్ తో సంబంధిత రోగి అధిక వైరల్ లోడ్ తో అధిక అంటువ్యాధి కలిగి ఉన్నాడని మరియు ఇతని వలన సంక్రమణ ప్రమాదము చాలా ఎక్కువుగా ఉంటుందని చెప్పవచ్చు.
కోవిడ్ యొక్క 2 వేవ్ లో ఎటువంటి దశలు,,,లక్షణాలు కలిగి ఉంటుంది?
మొదటి దశలో
వ్యక్తులలో కొద్ది పాటి జ్వరం, అలసట, కండరాల నొప్పులు, దగ్గు, గొంతు లో మంట, ముక్కు కారడం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి తో పాటు నీళ్ళ విరోచనాలు వంటి లక్షణాలు కనపడిన సందర్భం లో ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు వైధ్యాపరంగా మరియు CT స్కాన్ పరీక్షలో వ్యాధి నిరూపితం కాక పోయి ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులను హోమ్ ఐసోలేషన్ లో లేదా ఐసోలేషన్ వార్డ్ లకు తరలించవలసి ఉంటుంది.
రెండవ దశలో
తరచుగా కొద్దిపాటి లేదా ఒక మోస్తరు జ్వరం తో పాటు దగ్గుతూ బాధ పడుతూ ఉంటారు. వీరి ఛాతీకి CT స్కాన్ పరీక్ష నిర్వహించినపుడు ఫలితాలలో ఊపిరితిత్తులు దెబ్బతిని ఉండడం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో ఉన్న వ్యక్తులను ఐసోలేషన్ నుండి ఆసుపత్రులకు తరలించవలసి ఉంటుంది.
మూడవ దశలో
ఈ దశలో వ్యక్తులు తీవ్రమైన న్యుమోనియా వ్యాధికి గురవుతారు. దీని వలన వారు శ్వాస తీసుకోవడములో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. శ్వాస అందడం కష్టతరమవుతుంది. ఈ పరిస్థితిలో వారి రక్తం లో ఆక్సిజన్ శాతం 92 కంటే దిగువకు పడిపోయి వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఇటువంటి వ్యక్తులను వెంటనే ICU తరలించి చికిత్స అందించవలసి ఉంటుంది.
నాలుగవ దశలో
ఈ దశ అనేది చాలా క్లిష్ట తరమైనది అని చెప్పవచ్చు. ఈ దశ లో కోవిడ్ కు గురైన వ్యక్తులు తీవ్రమైన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులతో బాధపడతారు. ఈ దశలో ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టడం, మూత్రపిండాలు దెబ్బతిని పోవడం వంటి వాటి తో పాటు శరీరం లో ఉన్న అవయవాలకు సరిపడునంత ఆక్సిజన్ అందక అవి విఫలము అవడముతో ఏర్పడే షాక్ వలన గుండె విఫలం అయ్యి మరణం సంభవించవచ్చు.
*కేవలం ఒకే ఒక్క చిన్న మాస్క్ అనేది క్రమశిక్షణ తో మన నోటికి ముక్కుకు ధరించడము ద్వారా,
అలాగే అవసరమైనప్పుడు మాత్రమే బయటకు వెళ్ళడం, వెళ్ళాక మన కార్యక్రమాలు ప్రభుత్వము సూచించిన విధంగా సురక్షితముగా నిర్వహించు కోవడము, తిరిగి వచ్చాక చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో సుబ్రపరచుకోవడం వంటి పనులు కచ్చితముగా పాటించడం ద్వారా
మనం, మనతో పాటు మనం ప్రేమించే మన కుటుంబసభ్యులను, మన స్నేహితులను, మన ఇరుగుపొరుగువారిని, మన బంధువులను కోవిడ్ ప్రమాదము నుండి సురక్షితముగా కాపాడగలము.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: