ఐఎంఏ జాతీయ కమిటీ సభ్యుడుగా,,,

డాక్టర్ రవికృష్ణ 

డాక్టర్ రవికృష్ణ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ కమిటీ సభ్యునిగా నంద్యాల ఐఎంఏకు చెందిన డాక్టర్ రవికృష్ణను నియమిస్తూ ఐఎంఏ  జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయలాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ నియామక పత్రం పంపించారు. డాక్టర్ రవికృష్ణకు జాతీయ కమిటీలో సాంస్కృతిక విభాగం బాధ్యతల్ని అప్పగించారు. డాక్టర్ రవికృష్ణ గతంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షునిగా, కార్యదర్శిగా అదేవిధంగా రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ జాతీయ కమిటీ సభ్యునిగా ఎంపిక కావడం పట్ల  నంద్యాల ఐ.ఎం.ఏ. వైద్యులు సహదేవుడు,

మధుసూదనరావు, మధుసూదన్ రెడ్డి, అనిల్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ గుప్తా, చంద్రశేఖర్, వినోద్ తదితరులు హర్షం వ్యక్తం చేసి డాక్టర్ రవికృష్ణను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఐఎంఏ సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఆన్ లైన్ లో నిర్వహించి ఈ కరోనా సమయంలో వారు నిస్పృహకు లోను కాకుండా వారిలో ఉత్సాహం నింపడానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: