విద్యార్థులకు మెరిట్ టెస్ట్ లు

ఎడ్యూకేషనల్ ఎఫిఫణీ మార్కాపురం డివిజన్ సమన్వయ కర్త దూదేకుల నబీ


 
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

         ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సాహించుటకై ఎడ్యుకేషనల్ ఎఫిఫణి అనే స్వచ్చంద సేవ సంస్ధ ఆధ్వర్యములో  ప్రకాశం జిల్లా విద్యాశాఖా అధికారి అనుమతితో ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో మెరిట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎడ్యూకేషనల్ ఎఫిఫణీ మార్కాపురం డివిజన్ సమన్వయ కర్త దూదేకుల నబీ తెలియచేశారు. ప్రభుత్వ పాఠశాలలలో పదవతరగతి చదువుతున్న విద్యార్ధులకు ఈ పరిక్ష ఆన్ లైన్ విధానంలో రెండు దశలలో జరుగనుంది. మొదటి దశలో విద్యార్ధులు పాఠశాల స్ధాయిలో ఏప్రెల్ 29వ తేదిన ఫ్రీ యన్స్ రాయాల్సివుంటుంది. అందులో ప్రతిభ కనపరచిన విద్యార్ధులు మే 3వ తేదిన మెయిన్ పరిక్షలు రాయాల్సివుంటుంది. ఇందులో ప్రతిభ కనపరచిన విద్యార్ధులకు జిల్లా స్ధాయిలో ఒకటవ బహుమతి 24,000/-, రెండవ బహుమతి 20,000/-, మూడవ బహుమతి 16,000/- నాల్గవ బహుమతి 6,000/-,అయిదవ బహుమతి 4,000/-, యివ్వనున్నట్లు తెలిపారు. అంతెకాకుండా డివిజన్ స్ధాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులుగా 6,000/-, 4,000/-, 2,000/- అందచేయబడుతుంది. అలాగే మండల స్ధాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ స్ధానాలు సాదించినవారికి విద్యవిషయత సామాగ్రి అందచేయనున్నట్లు తెలిపారు. ఈ పోటి పరిక్షలలో పాల్గోనదలచిన విద్యార్ధులు ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యయులసహకారముతో  గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ చేసుకొనుటకు చివరితేది ఏప్రెల్ 7వతేది. కనుక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులందరూ ఈ ఆన్ లైన్ పరిక్షకు నమోదు చేసుకోవలసిందిగాకోరడమైనది. మార్కాపురండివిజన్ పరిధిలో మెరిట్ టెస్ట్ నిర్వహనలో టి. శ్రీనివాసులు, బి.వి.రామక్రిష్ణ, ఎమ్. సుధాకర్, నరసింహరావు గార్లు సమన్వయ కర్తలుగా వ్వహరిస్తారని పేర్కోన్నారు. మరింత సమాచారంకోసం మార్కాపురం డివిజన్ విద్యార్ధులు 9573139996 నెంబరులో సంప్రదించవలసిందిగా కోరినారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: