ఆసక్తికరంగా కొనసాగుతున్న,,,

ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లు...:

(జానోజాగో వెబ్ న్యూస్-స్పోర్ట్స్ ప్రతినిధి)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ ఆరు బంతులకు 37 పరుగులు చేసి జేడేజా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక్క పరుగుతో డీల్లీ క్యాపిటల్ జట్టు చేతిలో పరాజయం పాలయ్యింది. సూపర్ ఓవర్ ఢిల్లీ జట్టుకు గెలుపు అందించింది. దీంతో క్రికెట్ అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతీ జట్టు సమిష్టిగా రాణించి ప్లే ఆఫ్ కోసం పోటపడుతున్న నేపథ్యంలో కప్ ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి. కరోనా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సమయంలో ఇళ్లకే పరిమితం అవుతున్న అభిమానులకు క్రికెట్ ఆనందాన్ని అందిస్తోంది. ఈ సారి జట్టులోని సభ్యులందరూ సత్తా చాటేందుకు కృషి చేస్తున్నారు. పడిక్కల్ ఏకంగా సెంచరీ బాది అందరినీ ఆకట్టుకున్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఎంపిక కావాలనే పట్టుదలతో మైదానంలోకి దిగుతున్నారు. భారత బౌలర్లు, బ్యాట్స్ మెన్ సత్తా చాటేందుకు కృషి చేస్తున్నారు. యువ ఆటగాళ్లకు ఇదొక అద్భుతమైన అవకాశంగా తీసుకుని రాణిస్తున్నారు. భారత జట్టు ఎంపిక కోసం పోటీ ఆసక్తికరంగా నెలకొంది. రాబోవు ప్రపంచ కప్ కోసం పటిష్టమైన భారత జట్టు ఎంపిక చేయడం కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సన్నాహాలు చేస్తున్నారు. ఆటగాళ్ళ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొనసాగిస్తున్నాడు. కప్ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాడు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: