కరోనాలో తక్కువ ధరకు కూరగాయలు
- వేసవికాలంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ
- లడ్డు బాషా బ్రదర్స్ సేవలు అభినందనీయం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
శ్రీమంతులు కాదు, రాజకీయనాయకులు కాదు, పదవులు లేవు, అధికారం లేదు, ఉన్నతచదువులు, పెద్ద, పెద్ద వ్యాపారాలు లేవు. చిన్న,చిన్న వ్యాపారులతో తృప్తి పడే మనసత్వం. ప్రజలకు తమ స్తోమతతో సేవచేయడం ఒక్కటే వారి ఆస్తి, అధికారం, పలుకుబడి వారే లడ్డు బ్రదర్స్ సేవలకు నంద్యాల ప్రజలు హర్షిస్తున్నారు. పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవి ఎండలకు ప్రజలు సొమ్మసిల్లి పడిపోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మజ్జిగను పంపినిచేసి సెహబాష్ అనిపించుకున్నారు.
వీరికి తోడుగా నభినగర్ యూత్ కౌన్సిలర్ పురందర్ చెయ్యి కలిపారు. గత ఏడాది కరోనా కష్టకాలంలో పట్టణమంత లోక్డౌన్ విధించారు. ప్రజలకు కూరగాయలు అందని పరిస్థితి గమనించారు. డిఎస్పీ చిదానందరెడ్డి అనుమతితో ఇంటింటికి తోపుడు బండ్లపై కూరగాయలు పెట్టుకొని ప్రాణాలను లెక్కచేయకుండా కూరగాయలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సేవచేసేవారికి పదవులు ముఖ్యం కాదు. పదవుల కోసం ఓట్లకోసం ఐదేళ్ల కోసం ఒక్కసారి వచ్చే నాయకులకంటే చిన్న వ్యాపారం చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్న లడ్డు భాష సోదరులు చేస్తున్న సేవలకు సలామ్ కొట్టాల్సిందే.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: