తెలుగు సుబ్బలక్ష్మమ్మ నిజాయితీ

 - లక్ష విలువ చేసే బంగారు నెక్లెస్ అందజేత 

- డీఎస్పీ చిదానందరెడ్డి చేతుల మీదుగా బాధితురాలికి బంగారు నెక్లెస్ అప్పగింత

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం తెలుగు పేటకు చెందిన నాగేశ్వరమ్మ తన రెండు తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకొన్నగా అదే కాలనీకి చెందిన తెలుగు సుబ్బలక్ష్మమ్మకు దొరకడంతో తెలుగు పేట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కిరణ్ కు తెలియజేయడంతో ఇరువురు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వడం జరిగింది. బంగారు నెక్లెస్ పోగొట్టుకున్న నాగేశ్వరమ్మ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, విధి నిర్వహణలో ఉన్న సిఐ ఓబులేసు ఇరువురిని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు రమ్మని అక్కడే ఉన్న డిఎస్పి ఎం.చిదానందరెడ్డి చేతుల మీదుగా సుబ్బలక్ష్మమ్మ నాగేశ్వరమ్మకు బంగారు నెక్లెస్ అప్పగించారు. దీని విలువ సుమారు లక్ష రూపాయల విలువ ఉంటుంది. బంగారు నక్లెస్ ఇచ్చిన తెలుగు సుబ్బలక్ష్మమ్మను నంద్యాల డిఎస్పి ఎం.చిదానంద రెడ్డి, సిఐ ఓబులేసు ప్రత్యేకంగా అభినందించారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: