చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే 

- సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుమల్ల రహీం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే అని  సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు.సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నంద్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోలను సోమవారం కలవడం జరిగింది. ఏప్రిల్ 14న నిర్వహించబోయే గ్రామ సభలను సక్రమంగా పకడ్బందీగా నిర్వహించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుమల్ల రహీం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత దేశ పౌరులందరికీ
ఆధునిక ధర్మ శాస్త్రం అని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే యజమానులు అని పాలకులు అంతా సేవకులు మాత్రమని కావున 73 మరియు 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామాలలో గ్రామ సభలు పట్టణాలలో వార్డు సభలు నిర్వహించి స్థానిక  ప్రభుత్వాలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల అధ్యక్షులు ఉమా మహేష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శ ఆకుమల్ల రహీం, మండలాధ్యక్షులు ఉమా మహేష్ , కోశాధికారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముల్ల ఆరిఫ్, ఉపాధ్యక్షులు  శివనారాయణ, ఆఫీస్, అక్బర్,  సభ్యులు, ఖాదర్ భాష, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: