ముగిసిన జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు 

- పురుషుల ఛాంపియన్ గా  తెలంగాణ జట్టు

- మహిళలు ఛాంపియన్ గా  కేరళ జట్టు 

మొదటి బహుమతి సాధించిన తెలంగాణ జట్టు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూల్ జిల్లా నంద్యాల డిగ్రీ కళాశాల మైదానంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన 34వ  జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు ముగిసాయి. సీనియర్ పురుషుల బేస్ బాల్ ఛాంపియన్ గా తెలంగాణ జట్టు, మహిళా ఛాంపియన్ గా  కేరళ జట్లు నిలిచాయి. గత ఐదు రోజుల నుండి ఏపీ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు ముగిసాయి. ఉదయం జరిగిన పురుషుల ఫైనల్ పోటీలో ఢిల్లీ జట్టు విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపి పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిలు పాల్గొన్నారు. గెలిచిన జట్లకు శుభాకాంక్షలు  అందజేశారు.

మొదటి బహుమతి సాధించిన కేరళ మహిళల జట్టు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం నంద్యాలకు గర్వ కారణమన్నారు. ఇలాంటి మరెన్నో జాతీయ స్థాయి పోటీలు జరగాలని, అందుకు సహకారం అందిస్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షైక్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, నంది గ్రూప్ సంస్థల చైర్మన్ సజ్జల సుజల, నేషనల్ బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, సిఇఓ మాధవరావు, టోర్నమెంట్ ఆర్గనైజర్ కమిటీ కన్వీనర్ జగదీశ్వర్ రెడ్డి, ఏపీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు రామలింగారెడ్డి, నిర్వహకులు రవికృష్ణ తదిరులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీల విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. పురుషుల విభాగంలో తెలంగాణ ట్టు, మహిళా విభాగంలో కేరళ జట్లకు ట్రోపీలను, బంగారు పథకాలను అందజేశారు.



 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: