సమాజ శ్రేయాస్సుకు ప్రజలు సంఘటితం కావాలి
మహాత్మా జ్యోతి రావు పూలేకు ప్రజా సంఘాల నివాళ్లులు
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
బడుగు , బలహీన వర్గాల ఆశా జ్యోతి , అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త , మహిళా విధ్యాభివృధ్ధికి మార్గదర్శి నిత్యా స్ఫూర్తి ప్రధాత మహాత్మా జ్యోతి రావు పూలే గారి 194వ జయంతి సంధర్భంగా నంద్యాలలో ప్రజా సంఘాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ( ఏ.ఐ.ఎఫ్.బి ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని రాజునాయుడు , దళిత ఐఖ్య కార్యాచరణ అధ్యక్షులు మేకల లింగస్వామి , ప్రజా సంఘాల నాయకులు ఆకుమల్ల వెంకట సుబ్బయ్య , శ్రీనివాసులు , రాజశేఖర్ , పిఎం మధు బాబు , దస్తగిరి , సర్వయ్య , కేఎస్ డి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలె భారతదేశం లోనే మొట్టమొదటి సంఘ సంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషిచేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన దీశాలి మహాత్మ జ్యోతి రావు పూలే అన్నారు. విద్య లేనిదే వికాసం లేదు
వికాసం లేనిదే పురోగతి లేదు
పురోగతి లేనిదే ప్రగతి లేదు
ప్రగతి లేకనే శుద్రులు- అతిశూద్రులు అదో గతిపాలైనారనీ,
ఇన్ని అనర్దాలకు మూలము విద్య లేకపోవడమే అని పూలె అన్నారు.
సమసమాజ స్ఫూర్తి ధాత మనుషులందరు ఒకేలాగా వున్నపుడు కొందరిపై అసమానతలు ఎందుకు అని ప్రశ్నించ్చిన పూలె 18వ దశాబ్దంలోనే స్త్రీకీ విద్య అవసరం అని చెప్పి తన భార్యకీ చదువు నేర్పించి మహిళల కొరకు పాఠశాలలు స్థాపించిన మహానుభావడు మహాత్మ జ్యోతి రావు పూలే అని వారు తెలిపారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: