సాగర్ ను కేసీఆర్ కు కానుకగా ఇద్దాం

హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ

(జానోజాగో వెబ్ న్యూస్-నాగార్జున సాగర్ ప్రతినిధి)

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి ఈ సీటును ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇద్దామని ముస్లిం మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమ్మూద్ అలీ పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా  ఇబ్రహీంపెట్ గ్రామం, అనుముల మండలంలో  సలాం ఇబ్రహీంపెట్ , ముస్లిం మైనారిటీ సమ్మేళనంలో  ముస్లిం మైనారిటీ నాయకులతో సమావేశమైన హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజారిటీతో  గెల్పించాలి. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముస్లిం లను పట్టించుకోలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ముస్లింలకు న్యాయం జరిగింది. మైనారిటీ పిల్లల కోసం మైనారిటీ స్కూల్స్ , విదేశాల చదువులు, పేద అమ్మాయిల పెళ్లిళ్ల కోసం షాది ముబారక్ అనేక సంక్షేమ పధకాలు కేసీఆర్ ప్రవేశ పెట్టారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పధకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో మన రాష్ట్రందే అగ్రస్థానం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభివృద్ధి, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను అధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇద్దాం. అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే చందర్,  ఏఎంసీ ఛైర్మన్ నీలిమ, అప్కాబ్ మాజీ ఛైర్మన్ విజేందర్ రెడ్డి 00, హాలియా మున్సిపాలిటీ ఇంచార్జ్ బాసిత్, అబ్బాస్, మునీర్, ఫారీదుద్దీన్, హాలియా ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.


 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్ 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: