అమర్ నాథ్ కు అశృనివాళి
ఎం.డి అబ్దుల్
ఎం.డి అబ్దుల్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలిలో జర్నలిజంలో కొనసాగిన సీనియర్ జర్నలిస్ట్ అమర్ నాథ్ సార్ ఇకలేరు అన్న వార్త వినడానికి ధైర్యం చాలడం లేదని మైనార్టీ జర్నలిస్ట ఫ్రంట్ జాయింట్ సెక్రటరి, ఆంధ్రభూమి చీఫ్ సబ్ -ఎడిటర్, నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్, సీనియర్ జర్నలిస్ట్, జానోజాగో వెబ్ న్యూస్ సీఈఓ సయ్యద్ నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం కన్నుమూసారని తెలిసి ఎంతగానో చింతిస్తున్నాను.
సయ్యద్ నిసార్ అహ్మద్
అనారోగ్యంతో 10 రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇప్పుడే తుదిశ్వాస వదిలారు. ఆంధ్రభూమితో అమర్ నాథ్ గారికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన సేవలు మరచిపోలేనివి. పాత్రికేయ ఉద్యమానికి సారధి..నిబద్ధత కలిగిన పాత్రికేయులు అమర్‌నాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన లేనిలోటు తీర్చలేనిది.. అశృనివాళి. అని వారు పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: