మున్సిపల్ ఉర్దూ ఉన్నత బాలికల పాఠశాలను,,,

ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్‌ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణం ముల్లాన్ పేటలోని పురపాలక ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలను నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ఆద్వర్యంలో శుక్రవారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిచంద్రికిషోర్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. అతిధులుగా మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ మాబున్నీసా, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఇసాక్ బాష, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్ అబ్దుల్ మజీద్, ఎంఈఓ బ్రహ్మంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో బాలికల విద్యకు అన్ని విధాల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని తల్లిదండ్రులు బాలికలను పెద్దచదువులు చదివించాలని,
మద్యలో ఆపివేయరాదని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఉర్దూ బాలికల జూనియర్ కళాశాలకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యాయని కళాశాల నిర్మాణం చేపట్టడానికి స్థల సేకరణ చేపడుతున్నామన్నారు. అదే విధంగా నేడు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు 2కోట్ల 50 లక్షల వ్యయంతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేపట్టడం జరిగిందన్నారు. ఇది బాలికల విద్యకు ఎంతో శభసూచకమన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని కేవలం తల్లిదండ్రులు విద్యార్థినులను చదివించడమే తమ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఉర్దూ పాఠశాలకు అవసరమైన గదులు, ఆటస్థలం తదితర సౌకర్యాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫైజుర్ రహమాన్, ఉపాధ్యాయులు, విద్యావాలంటీర్లు, సీఆర్పీలు, పేరెంట్స్ కమిటీ చైర్మన్, సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: