జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ,,
అధ్యక్షులుగా అబ్దుల్ సమద్
నేడు బాధ్యతలు స్వీకరణ
కరోనా నేపధ్యంలో జమాత్ పై గురుతర బాధ్యత
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
ఈ నెల పదవ తేదిన ఆన్ లైన్ విధానంలో సభ్యుల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా సేకరించి, స్థానిక శాఖా అధ్యక్షులను జమాఆతె ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లాహ్ హుసైనీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని 59శాఖల అధ్యక్షుల పేర్లను రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ ప్రకటించారు. నంద్యాల జమాతె ఇస్లామీ హింద్ శాఖకు అధ్యక్షులుగా నియుక్తులైన షేక్ అబ్దుల్ సమద్, సీ. యం. జకరియా నుండి 2021-23 ద్వివార్శిక సంవత్సరానికి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులు యస్. షబ్బీర్ హుసేన్ అధ్యక్షతన చాంద్ బాడాలోని జమాత్ కార్యాలయంలో జరిగిన నిరాడంబర వేడుకలో బాధ్యతల మార్పిడి జరిగింది.ఈ సంధర్భంగా అబ్దుల్ సమద్ మాట్లాడుతూ జమాఆతె ఇస్లామీ పాలసీ తెరిచిన పుస్తకం అని, ఓ సైద్ధాంతిక సంస్థగా జమాత్ సందేశం, సంఘసేవ తదితర కార్యక్రమాల ద్వారా దేశంలో సేవలందిస్తుందన్నారు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సాధారణంగా తంతుగా జరిగే ఎన్నికలు నిర్వహిస్తారనీ, పదవుల కోసం పోటీలు, ప్రచారాలు ఉండవని సమద్ తెలిపారు. దేశవ్యాప్తంగా శాఖా అధ్యక్షుల ఎన్నికలు ఆన్లైన్ విధానంలో జరగడం ఇది ప్రధమం అన్నారు. దైవభీతితో నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని నూతన అధ్యక్షలు అబ్దుల్ సమద్ తెలిపారు. కరోనా నేపధ్యంలో సామాజికంగా తమ సంస్థ గురుతర బాధ్యతగా మతాలకు అతీతంగా సేవలు అందివ్వటం తమ ప్రధమ కర్తవ్యం అన్నారు. తనమీద నమ్మకంతో బాధ్యత అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ ముహమ్మద్ రఫీఖ్ గారికి స్ధానిక సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు షబ్బీర్ గారు అబ్దుల్ సమద్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాలలో జమాఆతె ఇస్లామీ గత ఆరు దశాబ్దాలుగా తన కార్యక్రమాల ద్వారా సుపరిచితమే. అమీర్ హుసేన్ ఖుర్ఆన్ పారాయణంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మోమీన్ గౌస్, జమీలుద్దీన్ మాట్లాడుతూ అనుభవజ్ఞుడు అయిన సమద్ జమాత్ ను ఉత్తమ రీతిలో నడపగలరని ఆశాభావం వ్యక్త పరిచారు. సమావేశంలో హాజరైన సభ్యులు, కార్యకర్తలు హజరై సమద్ ను అభినందించారు.
Post A Comment:
0 comments: