డానియల్ పురం సిఎస్ఐ చర్చినందు,,

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాలలో గుడ్ ఫ్రైడే ను క్రిస్టియన్ సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. డానియల్ పురం సిఎస్ఐ చర్చి నందు భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమానికి రెవ.కె.ఐజక్ బాబు అధ్యక్షత వహించారు. ఏసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడయ్యాడని రెవ కె.ఐజక్ బాబు దైవ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను జ్ఞాపకం చేశారు. 40 రోజుల ఉపవాస దీక్షలు ఉన్న భక్తులందరికి మజ్జిగ ఇచ్చారు. రెవ కె.ఐజక్ బాబు ముగింపు ఆశీర్వాదంతో గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ప్రార్థనలు ముగిసాయి. ఈ కార్యక్రమానికి దైవ సేవకులు,  సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద ఎత్తున హాజరై ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేశారు.


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: