తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలి

బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో అధికార పార్టీ వైసీపీ పెద్ద ఎత్తున్న బోగస్ ఓట్లను నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. తిరుపతి వెలుపలి వ్యక్తులను అక్కడికి తరలించి వారి చేత ఆ బోగస్ ఓట్ల వేయించి ఉప ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం వైసీపీ చేసిందని ఆయన విమర్శించారు. ఇది ఎన్నికల ప్రక్రియను విఘాతం కలిగించడమే కాకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేపట్టడమే అవుతుందన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు, సమాచారం సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కథనాలు హాల్ చల్ చేస్తున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని వెంటనే ఎన్నికలను రద్దు చేయాలన్నారు. బోగస్ ఓట్ల ఏరివేత, ప్రశాంతంగా ఎన్నికలు జరిగే వాతావరణంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని ఆయన కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: