జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలన్నారు తెలంగాణా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి...ఈ మేరకు జర్నలిస్టుల సమస్యలు, ప్రధానంగా కరోనా బారినపడుతూ కష్టాలు పడుతున్న జర్నలిస్టుల విషయాలపై టీయూడబ్య్లూజే(ఐజేయూ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ సమస్యలను వివరించారు...స్పీకర్ ఇంట్లో కాసేపు జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడిన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులను ఖచ్చితంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాల్సిందేనన్నారు....యూనియన్ తరపున విజ్ణప్తికి స్పందించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జర్నలిస్టులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ లిస్టులో చేర్చడమేగాకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్నవారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో అవి కల్పించాలన్నారు. కరోనా విజ్రుంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని..విధి నిర్వహణలో తప్పని పరిస్థితుల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు..ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి అండగా ఉండాలన్నారు.. కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున అకాడమి ద్వారా ఆస్పత్రిలో ఉంటే 20 వేలు, హోం క్వారంటైన్ లో ఉంటే కేవలం 10 వేలుమాత్రమే అందిస్తున్నారని...ఇవి మందులకు కూడా సరిపోని పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక కష్టాలు పడుతున్నారని విష్ణుదాస్ శ్రీకాంత్ స్పీకర్ ద్రుష్టికి తీసుకువెళ్లారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డుల విషయంలో కూడా జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు లేవని..వాటిని పునరుద్దరించి తిరిగి జర్నలిస్టులకు అండగా ఉండాలని ఆయనకు వివరించారు...జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షిస్తూ  స్పీకర్ శ్రీనివాసరెడ్డి స్పందించినందుకు టియూడబ్ల్యూజే క్రుతజ్ణతలు తెలిపింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: