పీవీ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో,,,

సమస్యలను పరిష్కరించండి 

- ఒకటో వార్డు కౌన్సిలర్ పిచ్చికె నాగార్జున

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న పీవీ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తాగడానికి నీరు లేక, మూత్రశాలలు దుర్భర స్థితిలో ఉందని, పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ఒకటో వార్డు కౌన్సిలర్ పిచ్చికె నాగార్జున అధికారులను కోరారు. శనివారం అయన వార్డులో పర్యటన నిర్వహించారు. చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,  అదే విధంగా పాఠశాలలోని 4 గదులలో ట్యూబ్ లైట్లు వెలగక పోవడంతో,  ఫ్యాన్లు పాడై పోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక చీకటిలో మగ్గుతూ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంపై నంద్యాల మండల విద్యాధికారి తక్షణమే స్పందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఒకటో వార్డు కౌన్సిలర్ పిచ్చికె నాగార్జున తెలిపారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  




 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: