పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
కరోనా బారినపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా ఆకాంక్షించారు. జనసేన, బీజేపీ సంయుక్తంగా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్త పోరాటాల ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులను ఇప్పటినుంచే సమాయత్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: