అంధుల క్రికెట్ టోర్నమెంట్ కు ...
క్రికెట్ కిట్ బహుకరణ
(జానో జాగో వెబ్ న్యూస్- కర్నూలు జిల్లా ప్రతినిధి)
స్పందన అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ నుండి రెండు రోజులపాటు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ కోసం నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ బైసాని రమేష్ సౌజన్యంతో 8వేల రూపాయల విలువచేసే క్రికెట్ కిట్ నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, నంద్యాల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర రెడ్డి, దాత బైసాని రమేష్ , టోర్నమెంట్ నిర్వాహకులు చంద్రశేఖర్, ఓబులేసు, గుర్రప్ప, రమణ తదితరులు పాల్గొన్నారు.
*నేటి నుంచి అంధుల క్రికెట్ టోర్నమెంట్*
శనివారం నుండి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగనున్న రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ లో వివిధ జిల్లాల నుండి 10 జట్లు పాల్గొంటున్నాయి. వీరికి భోజన వసతి నంది గ్రూపు కంపెనీల చైర్మన్ సుజల అందిస్తున్నారు. వసతి సౌకర్యం ప్రధమ నంది కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. టోర్నమెంట్ విజేతలకు అందజేసే ట్రోఫీలు, వ్యక్తిగత ప్రతిభకు అందించే జ్ఞాపికలు నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున మనోహర్ రెడ్డి ఇస్తున్నారు. స్పందన అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ టోర్నమెంట్ తిలకించవలసిందిగా నిర్వాహకులు చంద్రశేఖర్, పుల్లయ్య ప్రజలను కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: