అమేజాన్‌ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న,,,

రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ ల‌ `ప‌వ‌ర్ ప్లే`

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లై మంచి రెస్పాన్స్ తో హైయెస్ట్ వ్యూస్ ద‌క్కించుకుంటోంది. ఈ సంద‌ర్భంగా.. హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - ``మా ప‌వ‌ర్ ప్లే సినిమాకు థియేట‌ర్‌ల‌లో రిలీజైన‌ప్ప‌డు ఎలాంటి అప్రిసియేష‌న్ వ‌చ్చిందో ఇప్పుడు  అమేజాన్‌లో కూడా అలాంటి అప్రిసియేష‌న్ వ‌స్తోంది. చాలా మంది ఫ్రెండ్స్‌, స‌న్నిహితులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వారు ఫోన్ చేసి మంచి థ్రిల్ల‌ర్ సినిమా చూశాం అని అభినందిస్తున్నారు`` అన్నారు. 

ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా మాట్లాడుతూ  - `` నా జోన‌ర్‌లో కాకుండా ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేసిన `ప‌వ‌ర్ ప్లే` సినిమాకు ఓటీటీలో మంచి  రీచ్ వస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్స్‌తో పాటు భ‌విష్య‌త్తులో డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఈ విజ‌యం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది`` అన్నారు

నిర్మాత దేవేష్ మాట్లాడుతూ  -  ``థియేట‌ర్‌ల‌లో విడుద‌లై మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ అమేజాన్‌లో కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంది. మా చిత్రంలోని  హైలెట్ పాయింట్స్ అన్ని రిసీవ్ చేసుకున్న ఆడియ‌న్స్‌కి థ్యాంక్స్`` అన్నారు. 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ  -  ``ఓటీటీలో మా సినిమాను ఆదరిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి

క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,

సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,

సంగీతం: సురేష్ బొబ్బిలి‌,

ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,

ఆర్ట్‌: శివ‌,

ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,

కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,

నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: