జమాతే ఇస్లామ్ హింద్ ఆధ్వర్యంలో,,,

రంజాన్ స్వాగత సభ

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

దివ్యఖుర్ఆన్ బోధనలు మానవాళికి ఇహంలోనూ, పరంలోనూ దారిచూపుతాయని, మంచి, చెడుల విచక్షణ చూపే ఈ గ్రంథం రమజాన్ నెలలో అవతరించిందని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ లీగల్ అఫైర్స్ కార్యదర్శి ముహమ్మద్ ఇల్యాస్  అన్నారు. జమాఅతె ఇస్లామీ హింద్  స్థానిక కార్యలయంలో ఖిల్లా డివిజన్ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన రమజాన్ స్వాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ,.. ప్రకృతి వనరులైన గాలి, నీరు, సూర్యరశ్మి ఏవిధంగా మానవాళి సొంతమో ఖుర్ఆన్ గ్రంథమూ అందరి  సొంతమని, ఇది ఏ ఒక్కరి సొత్తూ కాదని ఆయన అన్నారు. ప్రపంచంలో విస్తృతంగా పఠించే గ్రంథం ఖుర్ఆన్ అయినప్పటికీ భావార్థాన్ని తెలుసుకోకుండా చదవడం లేదని, అల్లాహ్ తరపునుంచి వచ్చిన సందేశాన్ని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలంటే అర్థవివరణతో చదవాలని ఆయన నొక్కిచెప్పారు. భారతదేశాన్ని వెయ్యేళ్లు పాలించిన ముస్లిములు ఖుర్ఆన్ సందేశాన్ని చేరవేయడంలో విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రమజాన్ లోని ప్రతీ ఘడియను ముస్లిములు సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవుపలికారు. చరిత్రను మరిచే జాతి ఎప్పటికీ  చరిత్ర సృష్టించలేదని, ముస్లిములు తమ పూర్వీకుల చరిత్రను అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ముహమ్మద్ ప్రవక్త (స) సాధించిన మక్కా విజయాన్ని, బదర్ సంగ్రామ చరిత్రను చదివితే ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సబ్యులు అబ్దుల్ రాపె, షేక్ ఇలియాస్, నిహాల్ అహ్మద్, మొహినుద్దీన్, అబ్దుల్ రజాక్, షెక్ మలిక్,సలీమ్, గౌస్, యాకుబ్, హకీమ్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇండియా పట్టణ అధ్యక్షులు షేక్ మతిన్ పట్టణ కార్యదర్శి తౌసిఫ్ అహ్మద్ ఖాన్, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎమ్.పి.జె.) జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్, సెక్రటరీ నసీరుద్దిన్ తదతరులు పాల్గున్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: