ఉర్దూలో కూడా బోర్డులు ఏర్పాటు చేయాలి

కలెక్టర్ కు ఎంపీజే విన్నపం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

ఖమ్మం నగరంలో నూతన బస్ స్టాండ్, బహిరంగ ప్రదేశాలలో తెలుగు, ఇంగ్లీష్ లతో పాటు, ఉర్దూ లో కూడా బోర్డులు ఉంచాలని కలెక్టరు కు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎం.పి.జె) అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం నాయకత్వం లో జిల్లా నాయకులు ఈ రోజు కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి కే.సి.ఆర్ ఉర్దూ భాష ను  రాష్ట్రంలోనే రెండవ భాషగా గుర్తించారని ఈ సందర్భంగా కలెక్టరు కు గుర్తు చేశారు.
అనేక ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలో బోర్డులున్నట్లు తెలిపారు. కానీ ఈ మధ్య ఖమ్మం లో ప్రారంభించిన నూతన బస్ స్టాండ్ కు ఉర్దూ భాషలో బోర్డు కనిపించడం లేదు. కాబట్టి మీ దృష్టికి తీసుకు వస్తున్నామని ఖాసిం గారు కలెక్టరు కు విన్నవిస్తూ, ఒక వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమము లో జిల్లా ఎం.పి.జె కోశాధికారి ఎం.డి.హకీం, సభ్యులు రఫీక్, గౌస్, జాని, అబ్బాస్ తది తరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: