తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య,,,
ఆశయాలను పోరాటాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళతాం
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నర్రి స్వామి కురుమ ఈరోజు ఎల్బీనగర్ లోని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో దొడ్డి కొమురయ్య గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాదుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సుంకరి జనార్దన్ గౌడ్ గారు అతిథిగా వచ్చేందుకు అదేవిధంగా అనేకమంది న్యాయవాదులు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి స్వామి గారు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య గారు బడుగు బలహీన వర్గాల ధైర్యానికి ప్రతీక అన్నారు తన యొక్క చిన్న వయసులోనే ఉద్యమాలకు పోరాటాలకు ఆకర్షితుడై తెలంగాణ సాధించడంలో తొలి అమరుడయ్యాడు వారి యొక్క ఉద్యమస్ఫూర్తిని నేటితరం యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు దొడ్డి కొమరయ్య ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అనేకమంది న్యాయవాదులు గీతాదేవి ,పెద్ద బక్కులు, రవి , సరళ, మల్లేష్ వీరయ్య బీరప్ప సంపత్ రెడ్డి కొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: