అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సీతానాగులవరం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం సీతా   నాగులవరం గ్రామానికి చెందిన దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు తండ్రి పెద్ద లక్ష్మయ్య వయసు(48)గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఇంటి వద్ద పొలానికి వెళుతున్నానని చెప్పి వెళ్లటం జరిగిందని , ఇంటి వద్ద నుంచి వెళ్లేటప్పుడు తన వెంట  మందు డబ్బా తీసుకొని పోయి గ్రామంలో ఉన్నటువంటి తన దొడ్డిలో మందుతాగి చనిపోవటం జరిగిందని తెలిపారు.ఎస్ఐ  వెంకటేశ్వర్లు  గ్రామంలో విచారించగా గత పదిహేను సంవత్సరాల నుంచి  వ్యవసాయం పదిహేను ఎకరాల వరకు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని కానీ గత ఐదేండ్ల క్రితం నుండి వర్షాలు సక్రమంగా  పడకపోవటంతో గ్రామంలో 15 మంది రైతుల వద్ద దాదాపు 25  లక్షల నుండి 30  లక్షల వరకు అప్పు కావటం వల్ల ప్రతిరోజు అప్పు ఇచ్చిన వారు డబ్బులు అడుగుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవటం జరిగిందని తెలిపారు. కాగా మృతదేహాన్ని స్థానిక మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని స్థానికులకు అప్పగించారు . అయితే వెంకటేశ్వర్లకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయడం జరిగింది.  కుమారుడు ఆర్మీలో జవాన్ గా   ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. స్థానిక ఎస్ఐ ఆవుల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: