అనాధ శవానికి అంత్యక్రియలు
మానవత్వం చాటుకొన్న ముస్లిం నగరా
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
ఎవరూ లేని అనాథ శవానికి అన్ని వారై అంత:క్రియలు చేశారు. మానవత్వం ఇంకా బతికుందని వారు నిరూపించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా ఒక భిక్షగాడి అనాధ శవం ఉండగా ఎవ్వరూ గుర్తించక పోవటంతో ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాలమద్దిలేటి సబ్ ఇన్స్ పెక్టర్ కరీముల్లా ఆదేశాల మేరకు వారి సహకారంతో ముస్లిం నగారా&అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్.లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ టిప్పు సుల్తాన్ మానవతా రక్తదానం జిల్లా అధ్యక్షుడు షేక్ షబ్బీర్. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు సుల్తాన్.ఇనాయట్. కానిస్టేబుల్ వీరన్న తదితరులు జనరల్ స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కోవిడ్ తో మరణించిన అనాధలు అభాగ్యులకు ఎవ్వరూ లేరని దిగులు పడకండి మా సామాజిక సంస్థ మిత్రబృందం ఆధ్వర్యంలో అంత్యక్రియలతో పాటు వారికి మానసిక భౌతిక సహాయ సహకారాలు అందించటానికి అనునిత్యం అత్యవసర సమయాలలో సహకారం అందిస్తామని అన్నారు. 9346943336 ఈ నెంబరుకు సంప్రదించాల ని విజ్ఞప్తి చేశారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: