తెలంగాణ హైకోర్టులో వాక్సినేషన్
అధిక సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగస్తులు, జడ్జీలు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ హైకోర్టులో శనివారం కరోనా వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైకోర్టు ఉద్యోగులు, జడ్జీలు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంచార్జీ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో వాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. వాక్సీన్ తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డా.మాలవ్య మెడికల్ ఆఫీసర్ వివరించారు.
కోవాక్సిన్ తీసుకున్న వారు 28 రోజుల తర్వాత, కోషీల్డ్ 45 రోజుల తర్వాత తీసుకోవాలని ఆమె తెలిపారు. ఆల్కహాల్, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలు ఐదు రోజుల వరకు సేవించరాడని తెలిపారు. జ్వరం, ఒళ్ళనొప్పులు వచ్చినట్లయితే పారాసెటమాల్ బిళ్ళలను మాత్రమే వాడాలని సూచించారు. వాక్సీన్ తీసుకున్న వారు సైతం మాస్క్ లు, భౌతిక దూరాన్ని, శానిటైజ్ వాడాకాలను కొనసాగించాలని తెలిపారు. అన్నీ ఆహార పదార్థాలను తినొచ్చని వివరించారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: