ప్రజల దాహార్తి తీర్చే దానకర్ణుడు
- బొమ్మలసత్రంలో చల్లటి చలివేంద్రం ప్రారంభం
- చలివేంద్రాన్ని ప్రారంభించిన మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ప్రజల దాహార్తి తీర్చే నాయకుడే వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యనిర్వహ మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వేసవికాలం వచ్చిందంటే పట్టణంలోని రద్దీ ప్రదేశాల్లో బాటసారులకు చల్లటి మినరల్ వాటర్ అందిస్తున్నారు. పట్టణంలో గురువారం ఐదు ప్రాంతాల్లో నెలకొల్పి నేడు బొమ్మలసత్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటినుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానినని, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీలు మారలేదన్నారు. నా ఎదుగుదలకు, పదవులు రాకుండా అడ్డుపడినా ప్రజల సేవే పరమావిధిగా ముందుకు సాగుతున్నానన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి మైనార్టీలకు దక్కడానికి మేము పోటీ పడటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మైనార్టీలకు కేటాయించారని అన్నారు.
మైనార్టీలకు సముచితస్థానం కల్పించడం గర్వంగా ఉందన్నారు. పదవులన్నీ ఒకే కుటుంబానికి కాకుండా అన్ని వర్గాల వారికి కేటాయిస్తే పార్టీ బలోపేతమవుతుందనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదేశాల ప్రకారమే నడుచుకుంటానని, పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎప్పటికి నడుచుకొనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ నాగేంద్రరెడ్డి, ప్రసాద రెడ్డి, న్యాయవాది మాధవ రెడ్డి, యూసుఫ్ బాష, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: