అమర్నాథ్‌కు ఆశ్రునివాళి
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి
అమర్నాథ్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ నేత అమర్నాథ్ మరణం పట్ల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రెస్‌కౌన్సెల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, జర్నలిస్టు హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన సీనియర్ జర్నలిస్టు అమర్‌నాథ్‌ను కరోనా వైరస్ పొట్టనపెట్టుకోవటం అంత్యంత విషాదకరం. ఇరవై రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ సీనియర్ సభ్యుడైన అమర్‌నాథ్ అకాల మరణం జర్నలిçస్టులకు తీరని లోటు.ఆయన భౌతికంగా లేకున్నా..అందరి మనస్సుల్లో శాశ్వత ముద్రవేసుకున్న ఆయనకు మా కన్నీటి నివాళి. అని పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: