మైనార్టీల అభివృద్ధికి కృషిచేయండి
-అత్యధిక మెజార్టీ సాధించిన కౌన్సిలరుకు నగదు బహుమతి
- ముగ్గురు మైనార్టీ కౌన్సిలర్లకు సన్మానం
కౌన్సిలర్లకు సన్మానిస్తున్న దృశ్యం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు మైనార్టీల అభివృద్ధికి కృషిచేయలని రాయల్ కింగ్స్ కమిటీ అధ్యక్షులు ముజీబ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సాధిక్, ఆరిఫ్, అబ్దుల్ సమ్మద్ లను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీల్లో అత్యధిక మెజార్టీ సాధించిన సాధిక్ కు 10 వేల నగదు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఇషాక్ బాష మాట్లాడుతూ పట్టణంలో అధికంగా మైనార్టీలున్నారని, మైనార్టీల అభివృద్ధికి పాటుపడాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే గెలుపుకు కారణమన్నారు. నవరత్నాలు అర్హత కల్గిన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలన్నారు. మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా సహకారం అందిస్తుందన్నారు. వార్డుల్లో ప్రధానంగా నీటిసమస్య, పారిశుధ్య సమస్యలు పరిష్కరించాలన్నారు. మొదటిసారి ఎన్నికయ్యారని, అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కింగ్స్ కమిటీ కోశాధికారి ఆజం, కమిటీ ఇసి సభ్యులు ఇషాక్ రాయల్, నబి రసూల్, నూర్ మొహమ్మద్, గన్ని కరీం తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: