కరోనా పై అవగాహన కల్పించాలి

ముస్లిం హక్కుల పోరాట సమితి...జానోజాగో సంఘం డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

కరోనాపై ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  అవగాహన కల్పించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి...జానోజాగో సంఘం డిమాండ్ డిమాండ్ చేశాయి. సోమవారంనాడు నంద్యాలలో నడిగడ్డ లో ముస్లిం హక్కుల పోరాట సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎన్ డి యూనుస్, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలకు విడుదల చేసిన 32 వేల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకు పంచాలని అలాగే ఈ నిధిని వ్యాక్సిన్ తయారీ ఉపయోగించాలని అలాగే వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ఫార్మా కంపెనీ  అన్నింటిని తెరిపించి వ్యాక్సిన్ తయారికి వేగవంతం చేయాలని అన్నారు అలాగే ప్రజలు  కరోనా పై  భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలకు సెలవు ప్రకటించింది కానీ ప్రైవేట్ టీచర్లకు వారి కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి గారు నెలకు పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: