ఆటిజం కుటుంబాలకు
హెల్ప్ లైన్ నెంబర్ ఆవిష్కరించిన
ప్రముఖ నటుడు-నిర్మాత నాగబాబు!!
(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)
దేశవ్యాప్తంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా సలహాలు, గైడెన్స్ అందించడం కోసం 9100181181 హెల్ప్ లైన్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత- నటుడు కొణిదెల నాగబాబు ఆవిష్కరించారు. ఈ హెల్ప్లైన్ ద్వారా ఆటిజం బాధిత కుటుంబాలు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారి ఎదుగుదలలో వచ్చే మార్పులు, లోపాలు వాటి పరిష్కార మార్గానికి సంబంధించి ఉచితంగా సలహాలు, గైడెన్స్ పొందవచ్చని పినాకిల్ బ్లూమ్స్ సంస్థ వెల్లడించింది.
సహజంగా ఆటిజంతో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఉండదని, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటారని, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరని, వెలుగుని, శబ్దాన్ని కూడా భరించలేరని తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నారని, వారి కోసం helpline ఏర్పాటు చేశామని తెలిపింది. ఆటిజంతో పుట్టిన పిల్లలు శాపగ్రస్తులు కారనీ, థెరపీల ద్వారా వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా చేయవచ్చన్న పినాకిల్ బ్లూమ్స్ ప్రయత్నాలు విజయవంతం కావాలని నాగబాబు ఆకాంక్షించారు!!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: