విజృంభిస్తున్న కరోనా పంజా..

ఇక నుండి కఠిన ఆంక్షలు

ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి

మార్కాపురం ఎం.ఎల్.ఎ. కుందూరు నాగార్జున రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో,  కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం శాసన సభ్యులు   కుందురు నాగార్జున రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి తీసుకోవలసిన చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం పట్టణం లో వేగవంతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నoదున జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే హాస్పిటల్ లో రోగులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున మార్కాపురం పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా పరిషత్ బాలిక పాఠశాల లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే చెప్పారు.
మార్కాపురం డివిజన్ ఆర్.డి.ఓ. ఎమ్. శేషిరెడ్డి
మార్కాపురం లోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడాన్ని అధికారులు పరిశీలించడము జరిగిందన్నారు. మార్కాపురం పట్టణం లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్ద ఆయన కోరారు. మార్కాపురం పట్టణం లో వ్యాపా వర్గాలు ఇప్పటికే స్వచ్ఛందగా, మార్కెట్ షాపులను మూసివేస్తూ న్నారన్నారు. మార్కాపురం పట్టణం లో గత సంవత్సరము కంటె కోవిడ్ కేసులు 4 రేట్లు పెరిగాయన్నారు. మార్కాపురం పట్టణం లో రేపు శుక్రవారం వారం నుంచి ఉదయం6గంటల నుండి మధ్యాహ్నం1గంట వరకు మాత్రమే మార్కెట్లు, షాపులు తెరుచుకోవాలని ఆయన అన్నారు. మధ్యాహ్నం1 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు మార్కెట్లు, షాపులు మూసివేయాలని ఆయన తెలిపారు. ప్రజలు  కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు ఇంటి దగ్గరే ఉండాలని ఆయన చెప్పారు. ప్రజలు అందరూ సహకరించాలని ఆయన చెప్పారు. ముందుగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం కోవిడ్ కేర్ సెంటర్లు పరిశీలించారు. ఈ సమావేశంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీఎం. శేషి రెడ్డి, డి.ఎస్.పి కిషోర్ కుమార్,మార్కాపురం నియోజకవర్గ కోవిడ్ కేర్ సెంటర్ల  నోడల్ అధికారి సరళ వందనము,మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహమ్మద్, తహసీల్దార్ విద్యాసాగరుడు,    వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: