ప్రజలు అల్లాడుతుంటే - ఆహా ఓహో అంటూ పొగడ్తలా
కాంగ్రెస్ నేత జి.నిరంజన్
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
ఒక వైపు ప్రజలు అల్లాడి పోతుంటే మరో వైపు కె.టి.ఆర్, కవిత, ఇతర మంత్రులు, కె.సీఆర్ ను "ఆహా ఓహో అంటూ స్తుతించడమే" పనిగా పెట్టుకోవడము సిగ్గు చేటు తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కనీ వినని ఇబ్బందులలో ఉంటే, అందరికీ వాక్షిన్ ఉచితముగా ఇవ్వాలనుకోవడము ముఖ్యమంత్రిగా కె.సి.అర్ కనీస భాధ్యత. అందుకు ప్రపంచములో ఏ పాలకుడు చేయనంత గొప్ప పని చేసినట్ట్లు డబ్బా కొట్టడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. రాజ్యంగపరముగా గౌరవ ప్రదమైన పదవులలో ఉన్న శాసనసభ స్పీకర్ శ్రీ పోచారము శ్రీనివాస్ రెడ్డి మరియు శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు కూడా డబ్బా వాయిస్తూ తమ పదవుల గౌరవాన్ని కించ పరుస్తున్నారు. రోజూ ఏ పత్రికలో చదివినా, టి.వి లో చూసినా ప్రజల హృదయ విధారక అగచాట్లు, ఆక్షిజన్ కొరత, బెడ్ల కొరత, మందుల కొరత వార్తలు వస్తున్నా, ఏ గ్రామములో, ఏ బస్తీ లో చూసినా తమ వారు పోయినా చూసుకోలేక పోతున్నామనే రోదనలు రోజు రోజుకు పెరుగుతున్నా అవేమి పట్టనట్లు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు కె.సి.అర్ పొగడ్తలతోనే సరిపెట్టుకోవడము దురదృష్టకరము ఈ సున్నితమైన , విపత్కర సమయములో కూడా పరస్పరము సహకరించుకుని ప్రజలను గట్టెక్కించే ప్రయత్నము చేయకుండ, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వముపై , రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వముపై దుమ్మెత్తిపోస్తూ భాధ్యతారాహిత్యంగా వ్యవహరించడము, ప్రజా సంక్షేమము పట్ల వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అని జి.నిరంజన్ పేర్కొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: