మార్కాపురం మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో..
వ్యాక్సినేషన్ కార్యక్రమం
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
కమీషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ ఆదేశానుసారం ప్రకాశంజిల్లా మార్కాపురం మునిసిపల్ కమీషనర్ ఆధ్వర్యములో మునిసిపల్ కార్యాలయములో సోమవారంనాడు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వ్యాక్సిన్ వేశారు. ఇప్పటివరకు మొదటి డోస్ వాక్సిన్ కూడ తీసుకోకుండా మిగిలిపోయిన వారందరికి ఈ వ్యాక్సిన్ వేశారు. కమీషనర్ తమవంతు బాధ్యతగా వ్యాక్సిన్ వేయించుకొంటున్న వారినందరిని స్వయంగా పర్యవేక్షించారు, ఈ కార్యక్రమములో పాల్గొన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమములో మునిసిపల్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, అంగనవాడి సిబ్బంది, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణ మునిసిపల్ కమీషనర్ నయీమ్ అహమ్మద్
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: