" వకీల్ సాహెబ్ "

పవన్ కు కరోనా పాజిటివ్ 

హోం ఐసోలేశన్ కు పవన్ కళ్యాణ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

కాసేపటి క్రితమే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ టెస్ట్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. "" వకీల్ సాహెబ్ "" సినీ తారాగణం అందరికీ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని పవన్ సూచించారు. తిరుపతి ఉపఎన్నిక సభకు కూడా హాజరు కావడం లేదని పకటించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని త్వరలో కొలుకుంటానని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. జ్వరం, ఒళ్లు నొప్పుల కారణంగా కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చిందని అన్నారు. హీరోయిన్ నివెద థామస్ తో పాటు పలువురు సిబ్బంది కూడా టెస్ట్ చేయించుకున్నారు. "" వకీల్ సాహెబ్ "" ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొనడం వల్ల కరోనా సోకి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

హైదరాబాద్​లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో అపోలో వైద్యులు పవన్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3న తిరుపతిలో పాదయాత్ర, సభలో పవన్‌ పాల్గొన్నారు. హైదరాబాద్ వచ్చాక కరోనా పరీక్షలు చేయించుకోగా.. నెగటివ్​ వచ్చింది.  వైద్యుల సూచనతో తన వ్యవసాయ క్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లారు. అప్పట్నుంచి పవన్‌కు స్పల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు రావటంతో మరోసారి  కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధరణ అయ్యింది.  పవన్ ఆరోగ్యం గురించి చిరంజీవి దంపతులు ఆరా తీశారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: