ఆసుపత్రుల దోపిడి నియంత్రణకు,,,
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
కరోనా బాధితుల నుంచి పెద్ద ఎత్తున్న ఫీజులు వసూలు చేయకుండా ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు సయ్యద్ ముక్తార్ బాషా డిమాండ్ చేశారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటికే ఈ రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. కరోనా తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో మరింత మంది ప్రైవేటు ఆసుపత్రుల దోపిడికి గురికాకుండా ఫీజులు, ఇతర సదుపాయాలపై తనిఖీ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సందర్భంలో కోవిడ్ ఆసుపత్రుల పెంపు, బెడ్ల ఏర్పాటు, ఆసుపత్రుల ఆక్సిజన్ సౌకర్యంతోపాటు మందుల కొరత రాకుండా ప్రత్యేక చర్యలను ప్రభుత్వం చేపట్టాలని ఆయన కోరారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: