వై.ఎస్.ఆర్. టీచర్స్ ఫెడరేషన్,,,
ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా వరిమడుగు వెంకటరామిరెడ్డి
ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వరిమడుగు వెంకటరామిరెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో వై.ఎస్.ఆర్. టీచర్స్ ఫెడరేషన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా మార్కాపురం పట్టణములోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్ట్ంటుగా పనిచేయుచున్న వరిమడుగు వెంకటరామిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకం వుంచి జిల్లా అధ్యక్షత బాధ్యతలు అప్పగించినందులకు రాష్ట్ర అధ్యక్షుడు కె. జారిరెడ్డ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్ గారికి మరియు వివిధ మండలాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు.
వై.ఎస్.ఆర్. టీచర్స్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లాశాఖను రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్ధానంలో నిలబెడతానని ఉపాధ్యాయుల మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కొరకు నా వంతు బాధ్యతగా నిరంతరం అందుబాటులో వుంటూ శ్రమిస్తానని తెలియచేశారు. త్వరలో మన యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి మెరుగైన పి.ఆర్.సి. యిస్తారని, అంతర్ జిల్లా మరియు రాష్ట్ర బదిలీలు జరిగే విధంగా రాష్ట్ర నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమాల ద్వారా విద్యావ్యవస్ధను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రిగారికి వై.ఎస్.ఆర్. టీచర్స్ ఫెడరేషన్ తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమములో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా
జానో - జాగో వెబ్ న్యూస్, బ్యూరో చీఫ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: