జర్నలిస్ట్ అమర్నాథ్ మృతి పట్ల...
డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి సంతాపం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
జర్నలిస్ట్ ఉద్యమ నేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు అమర్నాథ్ మృతి మమ్ములను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వైసీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్దలు అమర్ నాథ్ గారితో కలసి అనేక అంశాలపై వివిధ టెలివిజన్ ఛానళ్లలో డిబేట్ లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఆయన పాల్గొనే ప్రతి చర్చ అర్థవంతంగా సాగడమే గాక అన్ని అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేయడం ఆయనకే సాధ్యం. అటువంటి మేధావి,జర్నలిస్ట్ అమర్ నాథ్ మృతి పత్రికారంగానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తిరనిలోటు. తుదిశ్వాస వరకు జర్నలిస్ట్ గా కొనసాగుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేసిన గొప్ప నాయకులు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. అని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: